'నువ్వు ముందు మెల్లిగా మాట్లాడు'.. శ్రీరెడ్డిపై ప్రెస్‌మీట్‌లో విలేకరిపై శివాజీరాజా ఆగ్రహం

  • శ్రీరెడ్డిపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన 'మా' 
  • అనంతరం వెంటనే వెళ్లిపోబోయిన శివాజీరాజా 
  • ఇంకాసేపు ఉండాలన్న విలేకరి
టాలీవుడ్ ప్రముఖులపై ఆరోపణలు చేసిన శ్రీరెడ్డిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఈ రోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయాన్ని ప్రకటించిన వెంటనే 'మా' సభ్యులు మీడియా సమావేశం నుంచి వెళ్లిపోతుండగా ఓ విలేకరి ఇంకాస్త సేపు ఉండాలని తాము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కోరారు.

 దీంతో ఆగ్రహం తెచ్చుకున్న శివాజీరాజా 'నువ్వు ముందు మెల్లిగా మాట్లాడు.. మెల్లిగా మాట్లాడు' అన్నారు. అనంతరం విలేకరులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు మళ్లీ కూర్చున్నారు. 'శివాజీ, కోపం వద్దు' అన్నట్లుగా పక్కనున్న సీనియర్ నటుడు నరేశ్ ఆయన చేతిని పట్టుకుని కూర్చోబెట్టారు. 
Go Back to Shorts
sri reddy
shivaji raja
press meet

More Telugu News